Wikileaks
వికీలీక్స్* కీ ఎన్టీఆర్ సంబందం ఏంటి*?   
               ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న వింటున్న పదం వికిలీక్స్. అయితే  ఇప్పుడు వికిలీక్సీ కు ఎన్టీఅర్ కీ రిలేషన్ ఏర్పడింది. ఏమిటా సంభందం అంటే  వికీలీక్స్* అన్న జర్మన్* పదాన్ని తెలుగులోకి అనువదిస్తే 'ఎన్టీఆర్*' అని  చూపిస్తోంది. ఇది విన్న చాలా మంది గూగుల్* అనువాదంలోకి వెళ్లి చెక్  చేస్తున్నారు. అందులో వికీలీక్స్* అన్న పదాన్ని ఆంగ్లంలో టైప్* చేసి  తెలుగులోకి అనువదించమంటే 'ఎన్టీఆర్*'అనే వస్తోంది మరి. దీంతో అంతర్జాలికులు  ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పొరపాటు  జరిగిఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సినిమా వాళ్లు అయితే దీన్ని ఓ  ప్రత్యేక వార్తగా ఎస్.ఎమ్మెస్ లతో షేర్ చేసుకుంటున్నారు. మీడియా కూడా ఈ  విషయమై ఆసక్తి చూపించటంతో ఈ టాపిక్ సినీ సర్కిల్స్ లో నలుగుతోంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఊసరివిల్లి బిజీలో ఉన్నారు. తమన్నా కథానాయిక.  సురేందర్*రెడ్డి దర్శకుడు. బి.వి.ఎస్*.ఎన్*.ప్రసాద్* నిర్మాత. రెండు పాటలు  మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తారు. అక్టోబరు  6న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఎన్టీఆర్*ని కొత్త కోణంలో  చూపించే చిత్రమిది. పోరాటాల్లోనూ, నృత్యాల్లోనూ ఆయన శైలి కనిపిస్తుంది.  దేవిశ్రీ ప్రసాద్* ఆరు హుషారైన బాణీలు అందించారు. ఈ నెల రెండోవారంలో  పాటల్ని విడుదల చేస్తామ''ని చెప్పారు. 'కిక్*' శ్యామ్* కీలక పాత్రధారి.  తనికెళ్ల భరణి, ఆద్విక్* మహాజన్*, మురళీ శర్మ, ఆహుతి ప్రసాద్*, ఎమ్మెస్*  నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: రసూల్* ఎల్లోర్*.